Bigg boss Yashmi : వద్దంటున్న కౌగిలించుకుంటున్నాడు యాష్మీ సంచలన ఆరోపణలు.. బిగ్ బాస్ హౌస్ లో ముదురుతున్న వివాదాలు

Bigg boss Yashmi

Bigg boss Yashmi and Manikhanta

Bigg boss Yashmi : బిగ్ బాస్ 8 సీజన్ లో రోజు రోజుకు వివాదాలు ముదురుతున్నాయి. మూడో వారం నామినేషన్స్ లో కూడా హాట్ హాట్ డిస్కషన్ లు జరిగాయి. వాద ప్రతివాదనలో హౌస్ మొత్తం రసాభాసగా సాగింది. జోక్స్ వేసే శేఖర్ బాషాను బిగ్ బాస్ నుంచి పంపించేశారు. శేఖర్ బాషాను రెండో వారమే ఎలిమినేట్ చేయడంతో అందరూ హర్ట్ అయిపోయారు. దీంతో సీజన్ పై చాలా వరకు ఇంట్రస్ట్ పోయిందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 8లో రొమాన్స్, లవ్ స్టోరీలు ప్రారంభం అయ్యేలా కనిపిస్తున్నాయి. సోనియా ఆకుల పృథ్వీ, నిఖిల్ ల మధ్య సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే తాజాగా యాష్మీ గౌడను మణికంఠ వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించి యాష్మీ గౌడ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నా పర్మిషన్ లేకుండా నన్ను హగ్ చేసుకోవడం ఏంటనీ బిగ్ బాస్ కు తెలిపింది.

మూడో వారం నామినేషన్స్ సందర్భంగా యాష్మీ గౌడ, నాగ మణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వీరిద్దరూ తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. నాగ మణికంఠ చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదని ఫేక్ గేమ్ ఆడుతున్నాడని యాష్మీ గౌడ ఆరోపించింది. దీనికి నువ్వు ఆడుతున్న గేమ్ తప్పు అని నాగ మణికంఠ అన్నాడు. కాగా వీరిద్దరూ గట్టిగా అరుచుకున్నారు.

అయితే బిగ్ బాస్ లో నేను ఉన్నంత కాలం నాగ మణికంఠను నామినేట్ చేస్తూనే ఉంటానని యాష్మీ గౌడ హెచ్చరించింది. కాగా నామినేషన్స్ అయిపోయిన తర్వాత యాష్మీ దగ్గరకు వచ్చి వెనక నుంచి యాష్మీని నాగ మణికంఠ కౌగిలించుకున్నాడు. నామినేషన్స్ వేరు అవన్నీ పట్టించుకోవద్దు అని అన్నాడు. కాగా నా పర్మిషన్ లేనిది నన్ను ఎలా హగ్ చేసుకుంటాడని యాష్మీ కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

TAGS