Pallavi Prashanth:పేరు మార్చుకున్న బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్
Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు తాజాగా నాంపల్లి కోర్టు కండీషనల్ బెయిల్‌ని మంజూరు చేసి కొంత ఉపశమనాన్ని కలిగించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అది పెరిగి పెద్దది కావడంతో విధ్వంసానికి దారితీసింది. ఆరు ఆర్టీసీ బస్సులపై దాడి జరగడం, ప్రభుత్వ ఆస్తులపై విధ్వంసం సృష్టించడంతో ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మహావీర్‌ను ఏ-2గా చేర్చి జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం, నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ను విధించడం తెలిసిందే.
అయితే నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేయడంతో శనివారం పల్లవి ప్రశాంత్, అతని సోదుడు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ పేరు మారింది. ఇన్‌స్టా ఖాతాలో అతని పేరు మారినట్టుగా తెలుస్తోంది. అందులో ప్రశాంత్ పేరు బయోను మార్చారు. `MALLA OCHINA Spy Team Winner` అని కొత్తగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో మార్చారు. ప్రశాంత్ మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది.
తన విజయంలో Spy Team పాత్ర ఎంతగానో ఉందని, ఆ విషయాన్ని ప్రశాంత్ గుర్తించి ఇలా మార్పులు చేసుకున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. బిగ్‌బాస్ కారణంగా ప్రశాంత్‌కు భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెడిగారు. ప్రస్తుతం అతని అకౌంట్‌ని 1 మిలియన్ మంది ఫాలో అవుతుండటం విశేషం. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్‌కు తాను అండగా నిలుస్తానంటూ భోలే ముందుకొచ్చారు. చంచల్ గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడని, అతని కోసం తాను నిలబడుతున్నానని భోలే ప్రకటించాడు. భోలే మాట్లాడుతూ రైతు బిడ్డకు న్యాయం జరిగిందని, 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనలతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోపే బెయిల్ వచ్చేలా చేసిన లాయర్‌కు ధన్యవాదాలు అన్నారు.