Pallavi Prashanth:బిగ్‌బాస్ విన్నర్‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌లో అతన్ని విన్నర్‌గా ప్రకటించిన అనంతరం ఆయన అభిమానులకు, అమర్ దీప్ అభిమానులకు మధ్య ఘర్షణ జరిగింది. గొడవ జరుగుతున్న ప్రాంతానికి పల్లవి ప్రశాంత్ కార్‌లో రావడంతో ఈ ఘర్షణ విధ్వంసానికి దారి తీయడం, పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను అభిమానుల ముసుగులో కొంత మంది ఆకతాయిలు పగలగొట్టడం, పలువురుఇ కార్లని కూడా ధ్వంసం చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు దీన్ని సమోటోగా తీసుకుని పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అతన్ని ఏ1 ముద్దాయిగా చేర్చిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, అతని సెల్ ఫోన్ కూడా స్విఛాఫ్‌లో ఉందని పుకార్లు మొదలయ్యాయి. తాను ఎక్కడికి పారిపోలేదని ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిద్ధిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌కు తరలించినట్టుగా సమాచారం.
ఆదివారం అన్నపూర్ణ స్టూడియో సమీపంలో జరిగిన ఘర్షణ, విధ్వంసానికి ప్రధాన కారకుడిగా ప్రశాంత్‌ని నిర్ధారించిన పోలీసులు అతని సోదరుడిని ఏ 2గా, అతని మిత్రుడిని ఏ3గా తేల్చారు. అంతే కాకుండా వారిని అరెస్ట్ చేశారు.