JAISW News Telugu

Bigg Boss Sonia : యాష్మీ బట్టలపై సోనియా కామెంట్స్.. నా ఇష్టం అంటూ రెచ్చిపోయిన యాష్మీ..

FacebookXLinkedinWhatsapp
Bigg Boss Sonia

Bigg Boss Sonia and Yashmi

Bigg Boss Sonia : మూడో వారం ఎలిమినేషన్స్ లో యాష్మి, సోనియా మధ్య హీట్ డిస్కషన్ జరిగింది. మొన్నటి వరకు ఒకే టీంలో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్ లు నామినేషన్స్ లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నీవు తప్పు చేస్తున్నావ్ అంటే నువ్వే తప్పు చేస్తున్నావ్ అంటూ ఇద్దరు నిందలు వేసుకున్నారు. ఇద్దరు మొన్నటి వరకు ఒకే క్లాన్ లో ఉండటంతో ఫ్రెండ్స్ గా మారిపోయారు. కానీ సోనియా ఆకుల యాష్మీని నామినేట్ చేయాలని పేరు చెప్పడంతో యాష్మి వెక్కి వెక్కి ఏడ్చేసింది.

సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు కరోనా వైరస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ గా పని చేశాడు. కాగా సోనియా ఎన్ జీవో సంస్థను నడిపిస్తోంది. సోనియా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టగానే అందరూ ఈమె అందానికి ఫిదా అయిపోయారు. ఇంత అందమైన అమ్మాయి బిగ్ బాస్ లో ఉందంటే మామూలుగా ఉండదు అనుకున్నారు. కానీ ఆమె అందంతో కాకుండా నోటితో ఫేమస్ అవుతోంది.

మొన్నటి ఎపిసోడ్ లో విష్ణుప్రియ అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తుందంటూ ఆమె వేసుకునే బట్టలపై, ఆమె కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంది. దీంతో ఆడియన్స్ సోనియా చాలా డేంజర్ గేమ్ ఆడుతోంది అంటూ మండిపడ్డారు. సోనియా తాజాగా యాష్మి పై నోరు పారేసుకుంది. నామినేషన్స్ సమయంలో నువ్వు గేమ్ ఆడే సమయంలో సరైన డ్రెస్ వేసుకోలేదు. చెప్పినా వినకుండా అలాగే చేశావ్ అంది.

దీనికి చిర్రెత్తుకొచ్చిన యాష్మీ నా  డ్రెస్ గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరూ అంటూ ఇచ్చి పడేసింది. నాకు ఏదీ కంఫర్ట్ గా ఉండే అదే వేసుకుంటా అని సమాధానం చెప్పింది. నీకు ఎందుకు అంటూ రెచ్చిపోయింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొన్నటి వరకు మంచి ఫ్రెండ్స్ గా ఉన్న ఈ ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ జరగడంతో అందరూ షాక్ కు గురయ్యారు.

Exit mobile version