Bigg Boss season 8 : వెక్కి వెక్కి ఏడ్చిన సోనియా.. బిగ్ బాస్ సీజన్ 8 రసకందాయంగా..

Bigg Boss season 8

Bigg Boss season 8

Bigg Boss season 8  : బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్, సోనియా మధ్య లవ్ పుట్టినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా నిఖిల్ గురించి సోనియా తెగ బాధపడిపోతుంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు క్లాన్ లుగా విభజించి గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. అయితే రేషన్ సరకుల విషయంలో గేమ్ ఆడించిన సమయంలో సోనియా టీం గెలిచింది. నిఖిల్ టీం ఓడిపోయింది. ఇందులో ఓడిపోయిన నిఖిల్ టీం కు రేషన్ రాలేదు. దీంతో సోనియా నిఖిల్ కు రేషన్ ఇవ్వడానికి కుదరదు.

సోనియా ఈ విషయంపై వెక్కి వెక్కి ఏడిచింది. సోనియా కావాలనే నిఖిల్ ను ముగ్గు లోకి దించుతున్నట్లు అనుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో లవ్ ట్రాక్ పట్టాలకెక్కిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. గతంలో షణ్ముక్ సిరి హన్మంతు ఇద్దరు లవ్ ట్రాక్ నడిపించారు. ఆ తర్వాత సీజన్ నుంచి లవ్ ట్రాక్ లు పడలేదు. రతిక, పల్లవి ప్రశాంత్ ఇద్దరు బాగా కనెక్ట్ అయినట్లు కనిపించారు.

కానీ పల్లవి ప్రశాంత్ గేమ్ దెబ్బతినగా.. రతిక నుంచి దూరంగా జరిగిపోయి అక్కా అని పిలవడం మొదలెట్టాడు. టైటిల్ కొట్టాడు. అయితే రేషన్ విషయంలో యష్మీ టీంలో సోనియాలో ఉంది కాబట్టి తాను గెలుచుకున్న రేషన్ ను నిఖిల్ ను ఇవ్వలేకపోతున్నానని అభయ్ ను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. దీంతో నువ్వు నీ గేమ్ ఆడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నిఖిల్ చెబుతాడు. సోనియా సరే అని వెళుతుంది.

నిఖిల్ తన గేమ్ ను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆడియన్స్ అనుకుంటున్నారు. గతంలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లు కూడా ఇలాంటి మాయలో నుంచి బయటపడి గేమ్ లో బాగా రాణించారు. దీంతో ఒకరు విన్నర్ గా, మరొకరు రన్నర్ గా నిలిచిపోయారు. నిఖిల్ కు గేమ్ అలవాటు అయిందని ఇంకా బాగా రాణించాలని అనుకుంటున్నారు.

TAGS