JAISW News Telugu

Bigg Boss season 8 : బిగ్ బాస్ సీజన్ 8లో శ్రుతి మించుతున్న రొమాన్స్.. ఇవేం పాడు పనులు

 

Bigg Boss season 8

Bigg Boss season 8

Bigg Boss season 8 : బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతుంది. టెలివిజన్ హిస్టరీలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోంది. తాజాగా బిగ్ బాస్ 8 లో రొమాన్స్ శ్రుతి మించుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్యన నడిచిన లవ్ స్టోరీ అందరికీ ప్రేమ దేశం సినిమాను తలపించేలా చేసింది.

వీరి మధ్య బాండింగ్ అంతలా పెరిగిపోయింది. మోనాల్ తినే సమయంలో ఆమెకు నీళ్లు కావాలంటే ఒకరిని మించి మరొకరు తీసుకెళ్లి ఇవ్వడానికి చేసిన ప్రయత్నం.. ఇద్దరి మధ్య మోనాల్ ఇరుక్కుపోవడం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాతి సీజన్ లో సిరి హనుమంతు, షణ్ముక్ జస్వంత్ ఇద్దరు కలిసి పెనవేసుకుని ఉండటం, చివరకు సిరి హనుమంతు మదర్ వచ్చి మీరిద్దరూ ఇలా హగ్ లు ఇచ్చుకోవడం మానేయాలని చెప్పడంతో చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఒక్కో సీజన్ లో ఒక్కొక్కరి మధ్య ప్రేమ, లేదా ఫ్రెండ్ షిప్ పుట్టడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజా సీజన్ లో సోనియా ఆకుల, పృథ్వీ, నిఖిల్ మధ్య ట్రయాంగిల్ ఫ్రెండ్ షిప్ నడుస్తోంది. ఇది కాస్త ముదిరి పాకాన పడే అవకాశం ఉంది. సోనియా ఇటు పృథ్వీరాజ్ తో అటు నిఖిల్ తో డీప్ హగ్ లు ఇచ్చేస్తుంది. రెండో వారంలోనే ఇలా ఉంటే ఇంకా 70 నుంచి 80 రోజుల వరకు ఎలా సాగుతుందోననే అనుమానం వ్యక్తవవుతుంది.

ఆమె ఇద్దరితోనూ హగ్గులు ఇచ్చుకోవడం, చేతులు పట్టుకుని కూర్చోవడం ఇంకాస్త దగ్గరై వారిపైనే పడుకుంటుంది. దీంతో సోనియా హద్దులు మీరి ప్రవర్తిస్తుందంటూ ప్రేక్షకులు తిట్టి పోస్తున్నారు. సోనియా నిఖిల్ తొడలపై చేతులు వేయడం, డీప్ హగ్గులు ఇవ్వడంతో రొమాన్స్ శ్రుతి మించిపోతుంది అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయినా ఈ మాత్రం దానికే అలా అనుకుంటే ఎలా అని సోనియా మద్దతుదారులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version