Bigg Boss OTT : బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అవ్వగానే ఓటీటీ వెర్షన్ కి సంబంధించిన రెండవ సీజన్ ప్రారంభం అవుతుంది అనుకున్నారు. రీసెంట్ స్టార్ మా యాజమాన్యం తో చర్చలు కూడా జరిపింది బిగ్ బాస్ టీం. పలువురి సెలబ్రిటీస్ ని కూడా ఇందుకోసం సంప్రదించినట్టు గత కొద్దిరోజుల నుండి వార్తలు వినిపించాయి. సెలబ్రిటీస్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియా లో విపరీతమైన ప్రచారం సాగింది.
కానీ ఇప్పుడు ఈ సీజన్ ని రద్దు చేసినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ సీజన్ కోసం గా బుక్ చేసుకున్న ఫ్లోర్ మొత్తం జీ తెలుగు ఛానల్ వాళ్ళు బుక్ చేసుకున్నారట. అసలు ఎందుకు ఈ ఓటీటీ సీజన్ రద్దు అయ్యింది?, సీజన్ 7 పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది కదా, మరి ఓటీటీ సీజన్ ని కూడా ప్రారంభించి ఉండొచ్చు కదా అని బిగ్ బాస్ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసారు.
కానీ ఎందుకో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ మించిపోతుంది అట, అంతే కాకుండా స్పాన్సర్లు కూడా ఓటీటీ సీజన్ పై పెద్దగా ఆసక్తి చూపించకపోవడం వల్లే ఈ సీజన్ ని క్యాన్సిల్ చేశారట. కానీ బిగ్ బాస్ సీజన్ 6 ఫ్లాప్ అవ్వగా, ఓటీటీ వెర్షన్ మాత్రం పెద్ద హిట్ అయ్యింది. దీనికి కొనసాగింపు ఉంటుందని చాలా ఆశపడ్డారు ప్రేక్షకులు. ఓటీటీ వెర్షన్ హిందీ, తమిళం భాషల్లో కొనసాగుతూ వచ్చింది. మన తెలుగు లో మాత్రం ఇక ఓటీటీ వెర్షన్ కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్టే అని అంటున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఒక సీజన్ సక్సెస్ అయ్యింది కదా అని, అన్నీ సీజన్స్ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. మొదటి సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ మళ్ళీ మళ్ళీ దొరకరు కూడా.
ఒకవేళ కంటెస్టెంట్స్ అంచనాలకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వలేకపోతే భారీ నుండి అతి భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి వాచినట్టు సమాచారం. కానీ టెలివిజన్ వెర్షన్ సీజన్ 8 ని సాధ్యమైనంత తొందరగా ప్రారంభించాలని చూస్తుంది బిగ్ బాస్ టీం. మే నెల నుండి ఈ సీజన్ ని ప్లాన్ చేస్తారట. ఈసారి కంటెస్టెంట్స్ విషయం లో మాత్రం రాజీ పడేదే లేదని, మొన్న గ్రాండ్ ఫినాలే లో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కఠినమైన రూల్స్ పెట్టబోతున్నారని టాక్.