Bigg Boss Nomination : బిగ్బాస్ హౌస్ మూడో వారం కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. నాలుగో వారం నామినేషన్ గ్రౌండ్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తనకు నచ్చని కంటెస్టెంట్ పై ఆరోపణలు చేసి నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్లలో ఎప్పటిలాగే నాగమణికంట మళ్లీ తన వక్రబుద్ధి చూపించాడు. మొదటి వారంలో విష్ణుప్రియ తో స్నేహంగా ఉన్న నాగ మణికంఠ రెండోవారం వచ్చేసరికి లోపాలను గుర్తించి ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెని నామినేట్ చేశాడు.
ఈ దెబ్బకు విష్ణు ప్రియకు దిమ్మతిరిగిపోయింది. ఎంతో బాధపడింది. రెండో వారంలో యాష్మితో స్నేహంగా ఉన్నట్టు చేసి వారం రోజులు తనతో ఎక్కువ సమయం గడిపి తీరా నామినేషన్ వచ్చేసరికి యాష్మిని నామినేట్ చేశాడు. దీంతో యాష్మి తట్టుకోలేకపోయింది. స్నేహమనే ముసుగులో నువ్వు మోసం చేశావు. కాబట్టి నిన్ను ఈ బిగ్ బాస్ షో లో ఉన్నన్ని రోజులు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్పింది.
దీనికి సరైన రీజన్ కూడా చెప్పింది తనతో స్నేహంగా ఉండి తాను ప్రవర్తించిన విధానాన్నే తప్పు పట్టి తనను నామినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకరితో స్నేహంగా ఉండి వారి దగ్గర ఉండే లోపాలు వారి దగ్గర ఉండే భావోద్వేగాలను పంచుకోవడం మానేసి దానిని పదిమందిలో పెట్టి ఇలా నామినేట్ చేయడం సరైనది కాదన్నాడు.
అందుకోసమే నిన్ను బిగ్ బాస్ షో అయిపోయే వరకు కూడా నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పింది. తాజాగా నిన్న జరిగిన నామినేషన్ లో ఆదిత్య ఓం ను కూడా ఇదే విధంగా నామినేట్ చేశాడు. హౌస్ లో ఉన్న సమయంలో ఆదిత్య నాగమణికంఠకు సలహాలు ఇచ్చాడు. నాగమణికంఠ ఆ సలహాలు తీసుకొని ఏకంగా ఆదిత్య నామినేట్ చేశాడు. మీ సలహాలు చాలా ఓవర్గా ఉంటున్నాయి. నాకు మీ సలహాలు అవసరం లేదు అని చెప్పడంతో ఆదిత్య ఓం ఒక్కసారిగా బిత్తర పోయాడు. ఇక నీకు నేను ఏమి చెప్పను అంటూ డైరెక్ట్ నామినేషన్ చేసేయాలని వెళ్ళిపోయాడు.