Bigg Boss : ఇక్కడా మేనేజ్‌మెంట్ ట్రీట్ మెంటేనా.! కంటెస్టెంట్ల విషయంలో ఇదేం వివక్ష ?
Bigg Boss : తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో 8వ సీజన్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నది. ఈ షో ప్రస్తుతం ఆరో వారాన్ని పూర్తి చేసుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చిన తర్వాత హౌస్ లో రచ్చ అయితే మాములుగా లేదు.. అయితే గత వారంలో యూట్యూబర్ కిర్రాక్ సీత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆమె ఎలిమినేట్ కావడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హౌస్ లో మొదటి నుంచి స్ట్రాంగ్ గా ఉన్న కిర్రాక్ సీత వెళ్లిపోవడం ఏంటి అని ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. వీక్ గా ఉన్న వాళ్లను పంపించకుండా సీతను పంపించడమేంటంటూ ప్రశ్నిస్త్తున్నారు..
ఇక ఈ సీజన్లో అనేక అంశాలు కేవలం కొంతమంది కంటెస్టెంట్లకు మాత్రమే బిగ్ బాస్ టీం అనుకూలంగా వ్యవహరిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది కంటెస్టెంట్లను కావాలనే హైలెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ కోటాలో నబీల్, మణికంఠ, విష్ణు ప్రియ కచ్చితంగా ఉంటున్నారనడంతో అతిశయోక్తి లేదు. గత వారం నబీల్ చాలా తప్పులు చేసినా, వాటన్నంటినీ వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున కప్పి పుచ్చే ప్రయత్నం చేసాడు. ప్రేరణ విషయం లో నబీల్ లో పరిపక్వత లేనట్లుగానే ప్రవర్తించాడు. ఆమె గురించి హౌస్ లో 15 మంది దగ్గరకి వెళ్లి మరీ చాడీలు చెప్పాడు.
హౌస్ లో మూడో వారంలో ప్రేరణ, యష్మీ ఆట తీరును నాగార్జున ఏమాత్రం గుర్తించలేదు, కానీ ఆ వారం మొత్తంలో వీళ్లిద్దరూ ఆడపులుల్లా రెచ్చిపోయి టాస్కులు పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. కానీ నాగార్జున కు మాత్రం అదేమీ కనిపించ లేదు.
గత వారంలో మణికంఠ బాగా ఆడుతున్నాడు అనుకులోగానే అతని మీద ఏకంగా ఏవీ చేసి చూపించాడు నాగార్జున. హోస్ట్ గా అందరినీ సమదృష్టితో చూడాల్సిన నాగార్జున కొందరి విషయంలో పక్షపాతం చూపించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. విష్ణు ప్రియ విషయంలో కూడా అదే జరగుతున్నది. ఆమెకు కచ్చితంగా బలమైన కోటింగ్ పడాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆమె హౌస్ యోగా చేయడం, పృథ్వీ వెనుక తిరగడం, వీకెండ్ ఎపిసోడ్స్ లో తింగరబుచ్చి లాగా ఓవర్ యాక్షన్ చేయడం, డ్యాన్స్ వేయడం తప్ప మరేమీ చేయడం లేదు. ఒక్క వారం కూడా ఆమెకు గేమ్ విలువ ఏంటో తెలిసేలా హోస్ట్ చేయడం లేదు. బిగ్ బాస్ టీం, నాగార్జున మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వారిలాగే ఈ ముగ్గురినీ ట్రీట్ చేస్తున్నారని చెప్పడం లో కూడా ఎలాంటి సందేహం లేదు.