Bigg Boss House : బిగ్ బాస్ హౌసా లేక నీ బెడ్ రూమా.. ఎక్కడ పడితే అక్కడే చేతులేస్తున్న కంటెస్టెంట్
Bigg Boss House : బిగ్ బాస్ సీజన్ 8 లో మళ్లీ కౌగిలింతలు, టచ్ లు పెరిగిపోయాయి. సోనియా ఆకుల మేల్ కంటెస్టెంట్ ల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ అందరికీ చిరాకు పుట్టిస్తోంది. అందరూ పడుకున్న తర్వాత నిఖిల్ ను గాఢంగా హత్తుకుని విడిచి పెట్టలేదు. దీంతో ఇది ఇంటిల్లీ పాది చూసే షో.. ఇప్పుడే హద్దు మీరి ప్రవర్తిస్తే ఇది బిగ్ బాస్ హౌసా.. లేక నీ బెడ్ రూం అనుకుంటున్నావా అని ట్రోల్స్ చేస్తున్నారు.
నిఖిల్ నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏదీ కావాలంటే అది ఇస్తా అని గత ఏపిసోడ్ లో కూడా అంది. అంటే దీనిర్థం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంత బరి తెగింపు మాటలు అవసరమా అని తిడుతున్నారు. దీంతో విష్ణు ప్రియను టార్గెట్ చేసి ఆమె క్యారెక్టర్ ను వారి కుటుంబ సభ్యులను కూడా దారుణంగా విమర్శించింది.
విష్ణుప్రియ టార్గెట్ గా సోనియా ఆకుల రెచ్చిపోతోంది. ఇటు పృథ్వీ, నిఖిల్ తో క్లోజ్ గా మూవ్ అవుతోంది. నిఖిల్ తొడలపై చేతులేసి ఇష్టారీతిన వ్యహరించడం చూసి ప్రేక్షకులు సోనియాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అఖిల్, మోనాల్,అభిజిత్ ల ట్రైయాంగిల్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఆ షోలో వారి లవ్ స్టోరీకి జనాలు ఫిదా అయ్యారు. కానీ వారు ఎక్కడా ఎక్కువగా వల్గర్ గా బిహేవ్ చేసినట్లు కనిపించలేదు.
కానీ సీజన్ 6 లో షణ్ముక్ జస్వంత్, సిరి హనుమంతు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇలా దారుణంగా ప్రవర్తిస్తే హౌస్ లోకి వచ్చిన సిరి హనుమంతు ఏకంగా షణ్ముక్ ను హెచ్చరించింది. నువ్వు నా బిడ్డకు దూరంగా ఉండూ అంటూ కెమెరాల ముందే చెప్పేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. కాగా ఈ సీజన్ లో మళ్లీ సోనియా ఆకుల ఇలాంటి ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తుంది.