Priyanka Jain : ‘మౌన రాగం’, ‘జానకి కలగనలేదు’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రియాంక జైన్, ఈ రెండు సీరియల్స్ తర్వాత ఆమె బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, మగవాళ్ళతో సమానంగా ఆటలు ఆడి, టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో ఎంతో మంది లేడీస్ కంటెస్టెంట్స్ వచ్చారు, కానీ ప్రియాంక ఒక్కటే చివరి వరకు వెళ్ళింది.
అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఈమె చేతినిండా సినిమాలు, సీరియల్స్ తో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతుందని ఆమె అభిమానులు అనుకున్నారు. కానీ ఆమె కేవలం తన ‘నెవెర్ ఎండింగ్ టేల్స్’ అనే యూట్యూబ్ ఛానల్ కి మాత్రమే పరిమితం అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. హౌస్ నుండి బయటకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆమె వీడియోలు చేస్తూనే ఉంది.
తన కాబొయ్యే భర్త శివ కుమార్ మీద ఇది వరకే ఆమె చాలా ప్రాంక్స్ చేసింది. కానీ మధ్యలో తన తల్లి కి క్యాన్సర్ ఉందని, కీమో థెరఫీ చేయించి మొదటి స్టేజి లోనే ఆమె ప్రాణాలను కాపాడగలిగామని ఒక వీడియో చేసింది. పోనిలే ఆమె తల్లి ఆరోగ్య కుదుటపడింది, ఇక అంతా హ్యాపీనే అని ఆమె అభిమానులు అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆమె తన తల్లి ఆరోగ్యం గురించి మరో వీడియో చేసింది. కీమో థెరఫీ ద్వారా మా అమ్మకి ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడిందని అనుకున్నాం, కానీ ఈ థెరపీ కారణంగా ఆమెకి ఎంతో ఇష్టమైన అందమైన జుట్టు మొత్తం ఊడిపోతుంది. దీనికి అమ్మ చాలా బాధపడుతుంది, కానీ ఆరోగ్యం కుదుట పడాలంటే ఈ థెరపీ చేయించుకోక తప్పదు కదా, నాకు ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదంటూ ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది.
పక్కనే ఆమె కాబొయ్యే భర్త శివకుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రియాంక ని ఓదార్చాడు. కానీ ఇలా ప్రతి వ్యక్తిగత విషయాన్ని వీడియోస్ పెట్టడం ఎందుకు అవసరమా అని కొంతమంది సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా పర్సనల్ గా చూసుకోవాలి, వీడియోస్ తీసి డబ్బులు సంపాదించాలనుకోవడం చాలా తప్పు, ప్రియాంక ఎందుకు ఇలా చేస్తుందో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.