Priyanka Jain Mother : క్యాన్సర్ బారిన పడిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తల్లి..కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ కామెంట్స్!

Priyanka Jain Mother

Priyanka Jain Mother

Priyanka Jain Mother : సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ ని దక్కించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ఆడపులి లాగ టాస్కులు ఆడుతూ, టాప్ 5 లోకి అడుగుపెట్టిన ఏకైక మహిళా కంటెస్టెంట్ గా నిల్చిన ప్రియాంక జైన్ గురించి మన అందరికీ తెలిసిందే. ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన వెంటనే తన యూట్యూబ్ ఛానల్ లో వరుసగా వీడియోలు పెడుతూ వస్తుంది. అందులో కొన్ని ఫన్ వీడియోస్ ఉండగా, మరికొన్ని బాధని కలిగించే వీడియోస్ కూడా ఉన్నాయి.

అయితే రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక వీడియో ఆమె ఫ్యాన్స్ చేత కంటతడి పెట్టించేలా చేసింది. ప్రియాంక జైన్ కి తన అమ్మ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బయట ఉన్నప్పుడు, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన అమ్మ గురించి అనేక సందర్భాలలో చెప్పుకొచ్చింది.

అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన ఆనందం పాపం ప్రియాంక జైన్ కి కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది. ఆమె బయటకి రాగానే, ఆమె తల్లికి క్యాన్సర్ అనే విషయం తెలుసుకొని కృంగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే ప్రియాంక అమ్మ గారికి పీరియడ్స్ సమయం లో అత్యధికంగా నెత్తురు పోతూ ఉండేదట. ఆడవాళ్ళకు అది సహజమే కదా, ఒక్కోసారి అలాగే అవుతూ ఉంటుంది అని అనుకుందట. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆమెకి అలాగే జరుగుతూ ఉండేదట. దీంతో అనుమానించిన ప్రియాంక ఆమెని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి టెస్టులు చేయించగా క్యాన్సర్ మొదటి స్టేజి లో ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారట.

దీంతో వెంటనే ఆమెకి లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా యూట్రస్ ని తొలగించేశారట. అప్పటి నుండి ప్రియాంక జైన్ తల్లి బాగుందని, ఇప్పుడు ఆమె  ఈ విపత్కర సమస్య నుండి బయపడింది, భయపడాల్సిన అవసరమే లేదని డాక్టర్లు చెప్పడం తో ఊపిరి పీల్చుకుంది ప్రియాంక. మీకు కూడా ఇలాంటి సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోండి, మాలగా ఆలస్యం చెయ్యొద్దు అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

TAGS