JAISW News Telugu

Bigg Boss Contestant Pregnant : బిగ్ బాస్ లో ఆ టాప్ కంటెస్టెంట్ ప్రెగ్నెంట్.. వైద్యులు పరీక్షలు.. రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే?

Bigg Boss Contestant Pregnant

Bigg Boss Contestant Pregnant, Bigg Boss Season 17

Bigg Boss Contestant Pregnant : బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ రియాలిటీ షోగా మన ఇండియాలో పలు భాషల్లో ప్రసారం అవుతూనే ఉంది.. మరి ఈ షోకు ఒంటరిగా వెళ్లి జంటలుగా మారుతూ ఒక ట్రెండ్ అనేది సెట్ చేస్తున్నారు.. భార్యాభర్తలు కూడా ఈ షోలో జంటగా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి.. తెలుగులో సైతం ఇలా జంటగా వరుణ్ – వితికా జంట పాల్గొన్నారు..

అలాగే రోహిత్ మరీనా జంట కూడా భార్యాభర్తలుగా మారిన తర్వాతనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇక అన్ని బాషల కంటే ముందుగా హిందీలో ఈ షో ప్రసారం అయ్యిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం సీజన్ 17 నడుస్తుంది.. అక్టోబర్ 15 నుండి ఈ లేటెస్ట్ సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది..

మరి ఈ సీజన్ లో నటి అంకిత లోఖండే, విక్కీ జైన్ పాల్గొన్నారు.. కాగా ఈ భామ ప్రెగ్నెంట్ అయ్యానేమో అనే సందేహం బయట పెట్టగా ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఒంట్లో నలతగా ఉండడంతో మెడికల్ రూమ్ లో ఈమెకు వైద్య పరీక్షలు చేసారు.. ప్రగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారని ఆమె భర్త విక్కీ జైన్ తో అన్నారు.

అయితే వైద్యులు మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదు.. గర్భం దాల్చాననే టెన్షన్ ఉందని ఈమె తన భర్తతో చెబుతుంది.. ఇదే నిజమైతే ఈమెనే బిగ్ బాస్ షోలో ప్రజెంట్ అయిన మహిళగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.. ఈమె తనకు ప్రెగ్నెన్సీ పరీక్షలు జరిగాయి అని చెప్పడం సంచలనంగా మారింది. బాలీవుడ్ మీడియా కూడా ఈ విషయాన్నీ కవర్ చేస్తూ దీన్ని హాట్ టాపిక్ చేస్తున్నారు.

అంకిత లోఖండే గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు.. ఈ భామ అక్కడే నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసింది.. ఈమె సీరియల్ యాక్టరస్.. పవిత్ర అనే సీరియల్ తో బాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది.. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్, అంకిత కలిసి సీరియల్ చేయగా ప్రేమలో పడ్డారు.. పెళ్లి అంటూ ప్రకటించాక వీరు అనూహ్యంగా విడిపోయారు.

Exit mobile version