Bigg Boss : బిగ్ బాస్ మరి ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. గతంలో రేటింగ్స్ కోసం గేమ్స్ ని పెడితే ఈ సారి మాత్రం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అని నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ బిగ్ బాస్ అనుకుంటున్నట్లు ఆడియన్స్ మాత్రం అంతా పిచ్చోళ్లు ఏం కాదు. చాలా తెలివైన వాళ్లు అని ఆయన గుర్తుంచుకోవాలి.
ఏది ఫేక్ గా నడుస్తుంది ఏదీ కావాలని చేస్తున్నారనేది మాత్రం ప్రేక్షకులు ఈజీగా గుర్తు పట్టేస్తారు. ఈ వారం టేస్టీ తేజ విషయం లో చేసిన చీప్ ట్రిక్స్ చూసి ఆడియన్స్ కు చాలా కోపం వచ్చింది. గత వీకెండ్ లో హౌస్ మేట్స్ అందరినీ లోపలికి పిలిచి వరస్ట్ కంటెస్టెంట్ ఎవరూ అని అడిగితే టేస్టీ తేజకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లో తల్లిదండ్రులు రాకుండా చేశారు. టేస్టీ తేజ గతంలో చెప్పినట్లు తాను బిగ్ బాస్ హౌస్ లో తన తల్లి కోసమే వచ్చానని చెప్పాడు. కానీ కావాలనే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నాడు.
గత వీకెండ్ లో హౌస్ మేట్స్ అందరిని లోపలకు పిలిచి ‘వరస్ట్ కంటెస్టెంట్’ ఎవరు అని అడగగా, తేజకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో టేస్టీ తేజ ఫ్యామిలీకి బిగ్ బాస్ నో ఎంట్రీ అని నాగార్జున చెబుతాడు. కాగా టేస్టీ తేజ మాత్రం ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది తన తల్లిని తీసుకురావడానికే అని ముందే చెబుతాడు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ అలుసుగా తీసుకుని ఇలా చేయడం సరైనది కాదని అంటున్నారు.
అయితే తనను ఎన్నిసార్లు నామినేటేడ్ చేసిన ఓకే. కానీ తన తల్లిని ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని అన్నారు. ఒక మూలన కూర్చొని ఏడ్చాడు. కాగా టేస్టీ తేజ తల్లిని హౌస్ లోకి పంపేందుకు అన్ని సిద్ధం చేశారని తెలుస్తోంది. కాగా టేస్టీ తేజతో బిగ్ బాస్ ఆడుకోవడంపై జనాలు ఫైర్ అవుతున్నారు.