Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నావాడే అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్!

Bigg Boss beauty hot comments on Pawan Kalyan
Pawan kalyan : పవన్ కళ్యాణ్ కి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ ఎప్పటికీ పెరగడమే తప్ప తరగడం ఉండదు. కేవలం ఆడియన్స్ లోనే కాదు, సినీ సెలెబ్రిటీలలో కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్టార్ హీరో కి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు మరియు హీరోయిన్స్ మొత్తం కూడా ఆయన అభిమానులే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అత్యధిక శాతం పవన్ కళ్యాణ్ అభిమానులే. అందులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అశ్విని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈమె సున్నితమైన మనస్తత్వం చూసిన హౌస్ లోకి వచ్చిన రెండు మూడు వారాల్లోనే వెళ్ళిపోతుంది అని అనుకునేవారు.
కానీ 11 వ వారం వరకు ఆమె హౌస్ లో కొనసాగింది. అన్నీ విషయాల్లో చాలా తేలికగా గొడవ పెట్టుకునే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా టాస్కుల విషయం లో ఆమె అద్భుతంగా ఆడింది అనే చెప్పాలి. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారితో నేను సర్దార్ గబ్బర్ సింగ్ అనే చిత్రం చేశాను. చిన్నప్పటి నుండి ఆయనని అభిమానిస్తూ పెరిగిన నేను, ఆయన సినిమాలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. సెట్స్ లో పవన్ కళ్యాణ్ గారు మా అందరితో ఎంతో సరదాగా ఉండేవాడు. నేను పాటలు పాడడం, డ్యాన్స్ వెయ్యడం వంటివి బాగా చేస్తాను కాబట్టి , ఆయన ఖాళీ సమయం లో నన్ను పిలిచే డ్యాన్స్ వేయించుకునే వారు.
నాకు అవసరమైనప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి క్యారవ్యాన్ ని ఎన్నో సార్లు వాడుకున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించాలని కోరుకున్నాను. ఆ స్థాయికి నేను ఎదుగుతానో లేదో తెలియదు కానీ, నేను మాత్రం ప్రతీ రోజు నా కలల్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటిస్తున్నట్టు, ఆయనతో డ్యూయెట్స్ పడుతున్నట్టు ఊహించుకుంటూనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అశ్విని.