Rave Party : బెంగళూరు ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ రెండు రోజుల నుంచి నిత్యం వార్తల్లో ఉంటుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ రేవ్ పార్టీకి హాజరైన 86 మంది వ్యక్తుల రక్త నమూనాలను పోలీసులు ఫోరెన్సిక్ కు పంపించగా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అనేకల్ సబ్‌డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహన్ కుమార్ బీఎస్ తెలిపారు. ‘మేము ఏ నటిని, నటుడిని అరెస్టు చేయలేదు, మేము పార్టీలో ఉన్నట్లు గుర్తించిన తర్వాత 30 వరకు యూరిన్ నమూనాలను సేకరించాం’ అని చెప్పారు.
‘రక్తం, యూరిన్ టెస్ట్ లో రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 86 మందికి పాజిటివ్ అని తేలిందని, ఎవరినీ అరెస్టు చేయలేదు’ అని మోహన్ కుమార్ బీఎస్ చెప్పారు. పార్టీకి వచ్చిన అతిథులంతా బయటి రాష్ట్రాలకు చెందినవారని పోలీసుల విచారణలో తేలింది. కేఎల్ వాసు నిర్వహించిన రేవ్ పార్టీని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఎలక్ట్రానిక్స్ సమీపంలో వెలుగుతోకి తెచ్చింది.
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బీ దయానంద మంగళవారం (మే 21) విలేకరులతో మాట్లాడుతూ, ‘మే 19 (ఆదివారం) రాత్రి ముందస్తుగా అందిన సమాచారం ప్రకారం.. బెంగళూర్ పోలీసులు సీసీబీ, ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌పై దాడి చేసింది. మాదక ద్రవ్యాలతో, మాదక ద్రవ్యాలను వాడుతూ సుమారు 100 మంది ఉన్నారు. అయితే వారు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనే అంశం తెలుసుకునేందుకు వారి రక్తం, యూరిన్ ల్యాబ్ కు పంపించాం. అందులో 86 మంది రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది.
తెలుగు నటి హేమకు కూడా పాజిటివ్ రావడంతో బెంగళూర్ పోలీసులు గురువారం నోటీస్ పంపినట్లు తెలిసింది. అయితే ఈ పార్టీకి తను వెళ్లలేదని చెప్పిన హేమ ఎంట్రీలో తన పేరు కృష్ణవేణిగా నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై హేమ మాట్లాడుతూ ‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా’ అని చెప్పడం విడ్డూరంగా ఉంది.