JAISW News Telugu

Prabhas Niharika Wedding : ప్రభాస్-నిహారిక పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి వెనుక ఇంత పెద్ద కథ జరిగిందా!

Prabhas Niharika Wedding

story behind cancellation of Prabhas and Niharika wedding

Prabhas Niharika Wedding : మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక కొణిదెల కి ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపు ఉంది. ఈమె కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, అవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. ఆ తర్వాత ఆమెకి చైతన్య అనే వ్యక్తితో పెళ్లి చేసాడు నాగబాబు. కొంతకాలం సజావుగా కాపురం సాగింది కానీ, అనుకోకుండా కొన్ని విబేధాలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరి పెళ్లిని నాగబాబు ఎంత వైభవంగా జరిపించాడో మనమంతా చూసాము.

ఇప్పటికీ ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆమె విడాకులు తీసుకోవడం మెగా ఫ్యాన్స్ కి కూడా ఇష్టం లేదు. ఇదంతా పక్కన పెడితే నిహారిక కి పెళ్ళికి ముందు పలువురు హీరోలతో డేటింగ్ జరిగిందని ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆమె డేటింగ్ చేసిన వారిలో నవదీప్, నాగ శౌర్య వంటి వారితో పాటుగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు అట.

వీరితో పాటుగా మెగా ఫ్యామిలీ కి సంబంధించిన సాయి ధరమ్ తేజ్ తో కూడా ఈమె ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేసింది నిహారిక. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ తో మాత్రం నిహారికకు ప్రేమాయణం నడిచిందని, వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందని ఇండస్ట్రీ లో ఒక టాక్ అయితే బలంగా నడిచింది . కానీ చెప్పుడు మాటలు వినడం వల్లే ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని అంటారు. నిహారిక స్నేహితుల వర్గంలో కొంతమంది ప్రభాస్ గురించి చాలా చెడుగా చెప్పారని, అది నమ్మి నిజమే అని అనుకొని నాగబాబు పెళ్లి చెయ్యలేదని అంటుంటారు.

అంటే ప్రభాస్ ఒక పక్క అనుష్క తో ప్రేమాయణం నడుపుతూనే మరోపక్క నిహారిక తో కూడా ప్రేమాయణం నడిపాడని, ఇలా సోషల్ మీడియా మరియు మీడియా ద్వారా వచ్చిన గాసిప్స్ వల్లే, వీళ్లిద్దరు పెళ్లి పెటాకులు అయ్యింది అంటూ ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపించేది. ఇందులో ఎంత మాత్రం నిజానిజాలు ఉన్నాయో మెగా ఫ్యామిలీ స్పందిస్తే కానీ తెలియదు. కానీ నిహారిక మాత్రం అప్పట్లో ఈ వార్త వచ్చినప్పుడు ప్రభాస్ నాకు అన్నయ్యతో సమానం, ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ కామెంట్ చేసింది, ఆమె మాటల్ని ఎంత మంది నమ్మారో ఏమిటో.

Exit mobile version