Modi visit Lakshadweep : మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక అంత పెద్ద స్కెచ్ ఉందా?

Modi visit Lakshadweep

Modi visit Lakshadweep

Modi visit Lakshadweep : ఈ నెల 2,3 తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ ఈ సడన్ టూర్ వెనక పెద్ద స్కెచ్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల అధికారిక పర్యటనలో ప్రధాని ఎక్కువ సమయం ప్రకృతి అందాలను ప్రపంచానికి చూపడానికే ప్రాధాన్యమిచ్చారు. తన పర్యటన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సముద్రంలో స్కార్నెలింగ్ చేయడం, సముద్ర అలల అంచున కుర్చీ వేసుకుని కూర్చోవడం, నడుస్తూ వెళ్లడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజలు చూపించిన అభిమానం తనను ఎంతో ఆకర్షించిందని మోదీ తెలిపారు. సాహసాలు చేయాలనుకునే వారు లక్షద్వీప్ ను ఫస్ట్ లిస్ట్ లో పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.

కాగా, మోదీ లక్షద్వీప్ పర్యటన ప్రధాన ఎజెండా దేశంలో టూరిజాన్ని పెంచడమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. మన దేశంలోనూ అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పడమే మోదీ లక్షద్వీప్ పర్యటన వెనుకున్న రహస్య ఎజెండా అన్న వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు, బిజినెస్ పర్సన్స్, భారత టూరిస్టులు ఎక్కువగా మాల్దీవులు వెళ్తున్న విషయం తెలిసిందే. మాల్దీవులు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దేశ పర్యాటకులు మాల్దీవులు వెళ్లకుండా ఇండియాలోనే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని, అక్కడ పర్యటించాలని పరోక్షంగా మోదీ టూరిస్టులకు సూచించారు. పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకుండా ఇక్కడ పర్యటిస్తే ఆదాయం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మన పర్యాటక రంగమూ డెవలప్ అవుతుంది.

ఇక మోదీ పర్యటన తర్వాత గూగుల్ లో ఎక్కువ మంది లక్షద్వీప్ గురించే వెతుకుతున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలి..టూర్ ప్యాకేజీలు, హోటల్స్, రవాణా సదుపాయాల గురించి తెలుసుకుంటున్నారు. ఇక భారత్ లో ఎక్కువ మంది వెతికిన వాటిలో లక్షద్వీప్ 9వ స్థానంలో నిలువడం విశేషం.

ఇక రాజకీయ కోణంలో చూస్తే..మన పక్కన దేశం మాల్దీవుల్లో మొన్నటి ఎన్నికల్లో చైనా అనుకూలవాది మహ్మద్ మయిజ్జు గెలిచారు. ఈయన చైనా చెప్పినట్టు వింటూ భారత దళాలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఈమధ్య సూచించారు. మన దేశంపై వ్యతిరేకభావంతో ఉన్నారు. అయితే మాల్దీవుల ఆదాయంలో మన ఇండియా నుంచి వెళ్లేది గణనీయంగానే ఉంటుంది. ఇక అక్కడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మన దేశంలో మాల్దీవ్స్ ను పోలి ఉండే లక్షద్వీప్ లో టూరిజం డెవలప్ చేయాలని మోదీ భావించారు. తాను వెళ్తే ఆ ప్రదేశం వెలుగులోకి వస్తుందని..అందుకే ఆయన అక్కడ పర్యటించారు.

TAGS