JAISW News Telugu

BRS : సిరిసిల్లలో బీఆర్ఎస్ కు భారీ షాక్ ? క్యాంపులో కౌన్సిలర్లు.. అసలేం జరుగుతుందంటే?

Big shock to BRS in Sirisilla?

Big shock to BRS in Sirisilla?

BRS  : రాష్ట్ర పాలనా పగ్గాలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో బీఆర్ఎస్ మెల్ల మెల్లగా ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చాలా వరకు మున్సిపాలిటీల్లో అధ్యక్షులు, చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వీగిపోతే మరికొన్ని చోట్ల కాంగ్రెస్ చేతిలోకి మున్సిపాలిటీ పగ్గాలు వెళ్లిపోతున్నాయి. అయితే ఇది సాధారణ నాయకుల ఇలాకాలో జరిగితే.. పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ.. సాక్షాత్తు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకాలో జరిగితే మాత్రం రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుంది. అదే ఇప్పుడు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ కొనసాగుతున్నారు. ఆయన పరిధిలోనే ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ పై సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 12 మంది  కౌన్సిలర్లు ఆదివారం క్యాంపునకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా వారి బాటనే పడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం కూడా ఇదే తీరు జరుగగా, స్థానిక పార్టీ పెద్దలు నచ్చజెప్పారు. దీంతో అప్పుడు సమస్య సద్దుమణిగింది. ఆ తర్వాత చాలా రోజులు దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆదివారం కేటీఆర్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం సమయంలో కౌన్సిలర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సిరిసిల్లతో పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ తన ఇలాకాలోనే పార్టీని చక్కదిద్దుకోలేకపోతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజులుగా కౌన్సిలర్ల తీరు కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. ఇదంతా కాంగ్రెస్ వెనుకుండి నడిపస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి.

Exit mobile version