MP Vallabhaneni Balashowry : ఆంధ్రప్రదేశ్ లో జనసేన దూసుకుపోతోంది. అధికారం కోసం అహర్నిషలు శ్రమిస్తోంది. అధికార మార్పిడి కోసం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. పార్టీని బలోపేతం చేసే పనిని అధినేత పవన్ కల్యాణ్ తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి వైసీపీ దురాగాతాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం వ్యూహరచన ఖరారు చేసుకుంటున్నారు.
వైసీపీలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వారిని వేదనకు గురి చేస్తున్నాయి. దీంతో వారు పార్టీ మారేందుకు ఆలోచిస్తున్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. పార్టీలో అధినేత తీసుకుంటున్న నిర్ణయాలతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తమ పదవి ఉంటుందో ఊడుతుందో కూడా తెలియడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ఇది వైసీపీకి పెద్ద దెబ్బగానే చెబుతున్నారు. 2004లో వైఎస్ఆర్ వారసుడిగా వచ్చిన బాలశౌరి గత ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా గెలిచారు.
పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ తో మాట్లాడిన తరువాత ఆయనతో నడవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పార్టీ మారి జనసేనలో చేరి ప్రజాసమస్యలపై పోరాడాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇంకా పలువురు నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.