MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. వారంరోజుల పాటు కస్టడీ..

MLC Kavitha
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత కు శనివారం మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్టు చేసిన ఎల్ఫోర్స్మెంట్ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు లో హాజరు పరిచారు.
కస్టడీలోకి ఇవ్వాలని కోర్టును ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోరారు. దీంతో ఏడు రోజులపాటు కస్టడీ కి ఇచ్చేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కవిత ఈనెల 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధీనంలో ఉంటారు.
వాస్తవానికి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కనీసం 10 రోజులపాటు కవితని కస్టడీకి ఇవ్వాలని కోరా రు. కానీ కోర్టు వారం రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తున్నట్లు జస్టిస్ నాగ పాల్ ప్రకటించారు. దీంతో కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తమ ఆధీనంలో కి తీసుకున్నారు.
TAGS BRS kavithaDelhi liquor scamED Charge SheetED VS KavithaKavitha CustodyMLC KavithaMLC Kavitha Custody