Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మంజూరైన బెయిల్ ను సవాలు చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. కేసును సమీక్షించే వరకు ట్రయలో కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని హైకోర్టు పేర్కొంది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
కాగా సీఎం కేజ్రీవాల్ బయటకు వస్తున్నారనే సమాచారంతో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు తిహాడ్ జైలు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే హైకోర్టు తీర్పు వారికి శరాఘాతంగా తగిలింది.