Vijayamma : ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం-విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..!

Vijayamma

Vijayamma

YS Vijayamma :  ఏపీ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉండే రెండు కుటుంబాలకు చెందిన ప్రతినిధులు సోమవారం అనూహ్యంగా కలిశారు. వారిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కాగా, మరొకరు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. దాదాపు ఆర గంట  పాటు సమావేశం అయ్యాక ఇద్దరూ తిరిగి వెళ్లిపోయారు. మాజీ సీఎం జగన్ ఇటీవల కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ చేస్తున్న రాజకీయ డిమాండ్ కు ఊహించని షాక్ తగిలింది.  ఇప్పటికే చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి అన్నను భయపెడుతున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ తల్లి విజయలక్ష్మి కలిసి ముచ్చటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ వ్యవహారంతో జేసీ కుటుంబం తీవ్ర రాజకీయ, ఆర్థిక ఇబ్బందుల పాలైంది. అలాగే 2024 ఎన్నికలలో జగన్ ను కాదని షర్మిలలకు మద్ధతు పలికి కాంగ్రెస్ గెలుపు కోసం వీడియో సందేశం పంపించి వైసీపీకి శత్రువయ్యారు తల్లి విజయమ్మ.

వైసీపీ ఓటమికి విజయలక్ష్మి వీడియో సందేశం కూడా ఒక కారణంగా భావించిన జగన్ అవసరమైన మేరకు మాత్రమే తన తల్లిని మీడియా ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, విజయలక్ష్మిని కలవడంతో వీరిద్దరి భేటీతో ఏపీ రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా అనే చర్చ ఊపందుకుంది. అవినాష్ రెడ్డి పై బాబాయ్ వివేకా హత్యారోపణలు మొదలైన నాటి నుండి జగన్ కుటుంబంలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ అధికారాన్ని చేపట్టి జగన్ సీఎం అయిన తర్వాత నుండి షర్మిలకు జగన్ కు మధ్య సంబంధాలు  చెడిపోతూ వస్తున్నాయి.

రాజశేఖర రెడ్డి కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చిన గ్యాప్ ఆర్థిక కారణాలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయంటూ షర్మిల సన్నిహితులు బయటపెట్టారు.  వివేకా హత్యతో మొదలైన ఈ కుటుంబం రాజకీయాలు ఒక్కో మలుపు తిరుగుతూ తెలంగాణ వరకు వెళ్లి తిరిగి ఏపీకి చేరుకున్నాయి.  అయితే ప్రతి విషయంలోనూ షర్మిలకు తన మద్దతు తెలియజేస్తున్న విజయలక్ష్మి నేడు టీడీపీ నేతను కలవడం వైసీపీ కి సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది.  ఏ విషయాన్నైనా చంద్రబాబుతో ముడి పెట్టి రాజకీయం చేయడం అలవాటైన జగన్ కు ఇది కూడా బాబు స్కెచ్ లో భాగమేనంటూ ఆ నింద చంద్రబాబు మీద నెట్టి తాను పక్కకు తప్పుకుంటారా..  జగన్ శత్రువులే తల్లి, చెల్లికి మిత్రులవ్వడానికి సాక్ష్యంగా వైసీపీ నే అవుతుందేమో.

TAGS