Meta : మెటాకు పెద్ద సమస్యలు… యాంటీ ట్రస్ట్ విచారణ ప్రారంభం!

Meta : ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా కు ప్రస్తుతం భారీ చిక్కులు ఎదురవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌ (US FTC) ఆధ్వర్యంలో మెటాపై అమెరికాలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్ ప్రారంభం కాబోతుంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ విచారణ మొత్తం 37 రోజుల పాటు సాగనుంది.

ఈ విచారణలో మార్కెట్‌లో మెటా గుత్తాధిపత్యం ప్రదర్శించిందన్న ఆరోపణలపై తీవ్రంగా విచారణ జరగనుంది. ముఖ్యంగా, మెటా సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్ , వాట్సాప్ లను విడదీయాలని FTC తీవ్రంగా ఒత్తిడి తీసుకురావచ్చని సమాచారం. మెటా ఆధిపత్యం వల్ల డిజిటల్ మార్కెట్లో పోటీ తరుగుతున్నదన్నది ప్రధాన ఆరోపణ.

TAGS