దేవర..
కొరటాల శివ-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. నవంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంతృప్తికరమైన రన్ తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు సిద్ధమైంది.
వెట్టెయన్..
రజినీకాంత్ ‘వెట్టైయన్’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, సినిమా చూసి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ డిజిటల్ ప్రేక్షకుల్లో ఉంది. ఈ లెక్కన చూస్తే ఓటీటీలో మంచి వ్యూవర్ షిప్ తో కొనసాగుతుందని అనుకుంటున్నారు.
ఏఆర్ఎం..
మలయాళ సినీ ప్రియుల కోసం టోవినో థామస్ నటించిన ఏఆర్ఎం డిస్నీ + హాట్ స్టార్ లో రానుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.
సిటాడెల్ : హనీ బన్నీ..
అదనంగా, యాక్షన్ సిరీస్ అభిమానులు గ్లోబల్ సిటాడెల్ ఫ్రాంచైజీ భారతీయ భాగమైన ‘సిటాడెల్: హనీ బన్నీ’ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు. నవంబర్ 7న హనీ బన్నీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్ లో దేవర, అమేజాన్ ప్రైమ్ లో వెట్టైయాన్, సిటాడెల్: హనీ బనీ, డిస్నీ + హాట్ స్టార్ లో ఏఆర్ఎంతో ఈ వీకెండ్ ఓటీటీ వీక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ దక్కనుంది.