Big Ice Sheet : ప్రపంచంలో మంచు కొండలు ఉంటాయి. అంటార్కిటికా ఖండం మొత్తం మంచు కొండలతో నిండి ఉంటుంది. మంచు పలకలు చూడముచ్చటగా ఉంటాయి. తెల్లగా మెరుస్తుంటాయి. దీంతో అక్కడ ఉంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఫలకలుగా గుర్తింపు పొందిన ఎ-23ఎ 30 ఏళ్లుగా కదలకుండా ఉండిపోయింది. ఎట్టకేలకు కదలడంతో అందరు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా ఎ-23ఎ ఏర్పడింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి వెడైల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచింది. దీని విస్తీర్ణం 4 వేల చదరపు కిలీమీటర్లు ఉంటుంది. దుబాయ్ విస్తీర్ణం 4114 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం మంచు ఫలకలకం ఎట్టకేలకు సాగర అడుగు భాగం వేరుపడి వేడి జలాల వైపు వెళుతున్నట్లు చెబుతున్నారు.
ప్రపంచంలోనే చాలా పెద్ద మంచు ఫలకాలకు భిన్నంగా ఎ-23ఎ తన ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలింది. దీంతో దాని ప్రయాణం మెల్లగా నడుస్తోంది. ఈ క్రమంలో మంచు ఫలకం మెల్లమెల్లగా ముందుకు వెళ్తోంది. ఇది కదలడంతో చాలా మంది పర్యవేక్షణగా చూస్తున్నారు. మంచు ఫలకం కదలడం వల్ల గమ్మత్తుగా అనిపిస్తుంది.
ఈ మంచు ఫలకం దుబాయి దేశం కన్నా విస్తీర్ణంలో పెద్దది. దీంతో దాని కదలిక అంత వేగంగా ఉండటం లేదని తెలుస్తోంది. మంచు ఫలకాలు కరిగిపోతుండటం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీని వల్ల సముద్రాల్లో నీటి శాతం ఎక్కువవుతోంది. ఇది భవిష్యత్ లో మరింత ముప్పుగా పరిణమించనుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.