Hyderabad:గుడిమల్కాపూర్‌లోని అంకుర హాస్పిట్‌లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలని అదుపు చేసుందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి భవనంపై నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో సమాయక చర్యలకు ఆటంకంగా మారింది. అగ్నిప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తొలుత ఆరోఅంతస్తులో మొదలైన మంటలు క్రమ క్రమంగా మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. భవనం ఆరో అంతస్తులో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు, హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇక్కసారిగా మంటలు వ్యాపించడంతో దాదాపు 100 మంది నర్సులు భయంతో కిందకు వచ్చేశారు.
అయితే వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ మొత్తం వారు హాస్టల్‌లోనే వదిలేశామని విలపించారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులను బయటికి తీసుకొచ్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది రోగులు ఉన్నారనే దానిపై స్పష్టతా రావాల్సి ఉంది. అంకుర ఆసుపత్రి పరిసరాల్లో దట్టమైన పొగ ఆవహించడంతో భీతావాహ పరిస్థితి నెలకొంది.
Big blaze in Ankura Hospital near pillar no 68 of PVNR Expressway in Jyothinagar area. No information on casualties. pic.twitter.com/K5D2cfL2zc
— serish (@serish) December 23, 2023