CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (జనవరి 10) బిగ్ చాలెంజ్ ఎదుర్కొనబోతున్నారు. నేటి చాలెంజ్ తో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ రెండూ ఆధార పడి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మొదట రిలీజ్ చేసేది ఎక్కువగా అధికార పార్టీనే. వైసీపీలో రోజుకో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కోల్పోతుండడంతో పరిస్థితి అందుకు విరుద్ధంగా మారుతుంది.
ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితాను నేడు పార్టీ అధినేత వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న ఈ లిస్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే రేపు ఈ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.
రేపు పూర్తి జాబితా బయటకు వస్తే జగన్ కు అసలు ఆట మొదలవుతుంది. గతంలో కేవలం 40 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వైసీపీలోని కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా నియంత్రించలేకపోయాడు. ఇక ఇప్పుడు పూర్తి జాబితా బయటకు వచ్చాక గుర్తింపు రాకపోవడంతో నిరాశకు గురైన రెబల్స్, ఆశావహులు, ఇతర కీలక నేతలు కచ్చితంగా పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోలేదు.
ఎన్నికలు మరింత దగ్గరకు వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తే హడావుడి.. ఫీవర్ లో అసమ్మతి కొట్టుకుపోయేది. కానీ ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైం ఉంది. మూడు నెలల ముందు ఇలా జాబితా ప్రకటిస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లే వారితో ఈ ఏడాది ఎన్నికల్లో విజయావకాశాలను మరింత దెబ్బతీస్తాయని విశ్లేషకుల అభిప్రాయం. కానీ జగన్ మాత్రం మూడు నెలల ముందే ప్రకటించి గెలుస్తానని చెప్తున్నాడు.