RJ Shekhar Basha : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ఆయనని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడు గంటలుగా సైబర్ క్రైమ్ ఆఫీసులో ఆర్జే శేఖర్ భాషను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ ఛానల్స్‌లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది.
బాధితురాలిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు శేఖర్ భాషా పై సైబర్ క్రైమ్ లో ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి హర్ష సాయి మీద హర్ష సాయి హీరోగా నటించిన మెగా సినిమా నిర్మాత, బిగ్ బాస్ ఫేం మిత్ర శర్మ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు యూట్యూబర్ హర్ష సాయి తన పై లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధించాడంటూ ఒక యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి యత్నించాడని.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. అలాగే తనను నమ్మించి రూ.2కోట్లు తీసుకుని మోసం చేసినట్లు యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో హర్ష సాయికి మద్దతుగా శేఖర్ బాషా మాట్లాడడంతో పాటు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని బాధిత యువతి ఆర్జే శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.