JAISW News Telugu

TANA Ballots : బిగ్ బ్రేకింగ్: ‘తానా’ బ్యాలెట్ల కౌంటింగ్

TANA Ballots

TANA Ballots

TANA Ballots : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)- 2023 ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదేనని పలువురు ధీమాతో ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ రోజు (జనవరి 18) మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతుందని ఎన్నికమల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ఒక ప్రకనటలో పేర్కొన్నారు. సియాటెల్ కు చెందిన ‘ఒటగ్రిటీ’ అనే సంస్థ సహకారంతో ఎన్నికలు ఈ సారి ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. సభ్యులకు ఈమెయిల్ ద్వారా, పోస్టల్ శాఖ ద్వారా ఒక కోడ్ ను పంపారు. ఈ కోడ్ ద్వారా సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రేపు (జనవరి 19) నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో పాల్గొనేందుకు అభ్యర్థులకు ఉదయం జూమ్ కాల్ లింక్ పంపుతామని కనకం బాబు తెలిపారు. మొత్తం పోలైన ఓట్లు, చెల్లనివి వంటి లెక్కలు క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.

కౌంటింగ్ ప్రక్రియలోని ముఖ్యాంశాలు
1. 25 ఓట్ల కన్నా తక్కువ మెజార్టీ ఉంటే రీకౌంటింగ్ చేస్తారు.
2. ఇరు వైపుల వారికి సమాన ఓట్లు వచ్చి ఎన్నిక డ్రాగా ముగిస్తే కాయిన్ ఎగరేసి విజేతను నిర్ణయిస్తారు.
3. ‘తానా’ వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచిన 48 గంటల్లోగా పోటీలో ఉన్న అభ్యర్థులు $500 తానాకు చెల్లించి ఎన్నికకు సంబంధించి ప్రశ్నించవచ్చు. 48 గంటల తర్వాత ప్రశ్నలు వేయకుంటే బ్యాలెట్లను శాశ్వతంగా ధ్వంసం చేస్తారు.
4. 100 కన్నా తక్కువ మెజారిటీ వచ్చిన అభ్యర్థులు బ్యాలెట్లను ఫలితాలు వెలువడిన 48 గంటల్లోపు రీ కౌంటింగ్ చేయాలని అభ్యర్థించవచ్చు. దీనికి $5000 చెల్లించాలి. ఈ రీకౌంటింగ్ కు కూడా ఒక్కసారి మాత్రమే అనుమతి ఉంటుంది.

Exit mobile version