Big Boss Shivaji : బిగ్ బాస్ శివాజీ కూతురు కి తల్లి ఆ హీరోయినా..? ఇన్ని రోజులు దాచిపెట్టేసారుగా!
Big Boss Shivaji : ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ , ఫాలోయింగ్ ని సోవాజి కేవలం బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా దక్కించుకున్నాడు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముమ్మాటికీ అది నిజమే. హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు శివాజీ ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు. మూడు వారాల్లో ఇంటికి వెళ్ళిపోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ హౌస్ లో బుద్ధి బలంతో అతను ఆడిన ఆట బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ ఆడలేదనే చెప్పాలి.
ఈ సీజన్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకడు శివాజీ. అందులో ఎలాంటి సందేహం లేదు. బయటకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ’90s’ అనే వెబ్ సిరీస్ విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. చూస్తూ ఉంటే శివాజీ మహర్దశ పెట్టుకుందనే చెప్పాలి. వరుసగా సినిమా ఆఫర్స్ కూడా క్యూలు కడుతున్నాయి అట.
ఇదంతా పక్కన పెడితే శివాజీ హౌస్ లో ఉన్నప్పుడు ప్రముఖ నటుడు సమీర్ ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అందరూ అనుకుంటున్నట్టు శివాజీ కి కేవలం ఇద్దరు మగపిల్లలు మాత్రమే ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ఆయనకీ ఒక కూతురు కూడా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ఇదేంటి శివాజీ కి కూతురు ఉండడం ఏమిటి?, అసలు ఏమి మాట్లాడుతున్నాడు అంటూ సమీర్ పై శివాజీ ఫ్యాన్స్ అప్పట్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ రూమర్ ఇప్పటికీ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇలాంటి వార్తలు బయటకి వస్తే మన గాసిప్ రాయుళ్లు ఏ రేంజ్ లో దుష్ప్రచారాలు తమ క్రియేటివిటీ ని జోడించి ప్రచారం చేస్తారో మనకి తెలిసిందే. శివాజీ విషయం లో కూడా ఒక స్టోరీ వినిపిస్తుంది.
ఈయన పదేళ్ల క్రితం ఒక సినిమాలో హీరో గా నటించాడని, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయితో డేటింగ్ చేసి, ఒక పాపకి జన్మనిచ్చాడని. ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా వాళ్లిద్దరూ సైలెంట్ గానే విడిపోయారని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అసలు నిజం ఏమిటో ఇంకా ఎవరికీ తెలియదు. శివాజీ కూడా దీనిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదంటే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.