Big Boss Shakeela : ఒకప్పుడు హీరోయిన్ గా యువతని ఉర్రూతలూ ఊహించి , ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించిన నటి షకీలా. మలయాళం లో అప్పట్లో ఈమె సినిమా విడుదల అవుతుంది అంటే అక్కడి సూపర్ స్టార్స్ సినిమాలు కూడా వాయిదా పడేవి. ఆ రేంజ్ క్రేజ్ ఉండేది ఆమెకి. ఈమె సినిమాల వల్ల తమ సినిమాలకు కలెక్షన్స్ తగ్గుతున్నాయని అప్పట్లో ఈమెని మలయాళం ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.
ఆ తర్వాత అనేక టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తూ వచ్చిన షకీలా, రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్స్ గా పాల్గొన్నది. పెద్ద వయస్సులో కూడా కుర్రాళ్లతో సమానంగా బాగానే ఆడింది కానీ, ఎందుకో రెండవ వారం లోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు, మీడియా కి చాలా తక్కువగా కనిపించింది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె తన పెంపుడు కూతురు సీతల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. విషయం లోకి వెళ్తే నిన్న ఇంట్లో చోటు చేసుకున్న ఒక చిన్న మనస్పర్ధ వల్ల శీతల్ ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, ఆ తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసి ఇంటికి పిలిచానని, శీతల్ తన తల్లితో కలిసి వచ్చిందని, ఆమెకి సర్ది చెప్పి మళ్ళీ మా మధ్య సయోధ్య కుదిరించుకోవాలని నేను ప్రయత్నం చేస్తే, అందుకు ఆమె తనపై దాడి చేసిందని, ఆమె తల్లి నాతో, నా లాయర్ తో అసభ్యపదజాలం తో దుర్భాషలాడిందని షకీలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోపక్క అదే పోలీస్ స్టేషన్ లో అదే రోజున శీతల్ కూడా షకీలా పై పోలీస్ కేసు నమోదు చేసిందట.
ఇద్దరికి కంప్లైంట్స్ ని తీసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనాధ పిల్లల్ని, హిజ్రాలను మరియు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లలను ఒక దగ్గర చేర్చి షకీలా గత కొంతకాలం నుండి ఆశ్రయం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలా ఆమె ఆశ్రయం లో బ్రతుకుతున్న ఎంతోమందిలో ఒకరు శీతల్.