Big Boss Big Twist : బిగ్ బాస్ సీజన్ 7 12వ వారం కూడా రసవత్తరంగా సాగుతుంది.. 11 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సీజన్ ఈ వారం కూడా అంతే సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతుంది.. ఈ వారం హౌస్ లో 10 మంది సభ్యులు ఉండగా వారి మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతుంది.. ఇక ఇప్పటికే ఈ వారం నామినేషన్స్ ముగిసాయి.
ఈ వారం నామినేషన్స్ లో 6 మంది సభ్యులు ఉండగా డబల్ ఎలిమినేషన్ జరగనుందని నాగార్జున గత వారమే ప్రకటించాడు.. మరి ఈ వారం ఏ ఇద్దరు అవుట్ అవుతారా అని ఆడియెన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.. ఓటింగ్ ప్రకారం అయితే ఈ వారం అశ్విని, రతికా రోజ్ అవుట్ అనే టాక్ వినిపిస్తుంది. కానీ ఇది ఉల్టా పుల్టా కావడంతో ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.
ఇక నామినేషన్స్ ముగియగానే కెప్టెన్సీ టాస్క్ కోసం మెషీన్ గన్ టాస్క్ ఇచ్చాడు.. ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ అని బిగ్ బాస్ చెప్పాడు.. మరి ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్, అర్జున్ మాత్రమే మిగిలారు.. ఇక చివరిలో ఈ ఇద్దరిలో ఒకరిని గన్ తో కాల్చేసి ఒకరిని కెప్టెన్ చేయాలని ఆ బాధ్యతను శివాజీ, శోభా లకు ఇచ్చాడు బిగ్ బాస్..
అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో శోభా అమర్ వైపు నిలబడగా శివాజీ అర్జున్ ను సపోర్ట్ చేసాడు. దీంతో అమర్ దీప్ తనను కెప్టెన్ గా చెయ్యాలని హౌస్ లో రచ్చ రచ్చ చేస్తూ చివరికి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అయితే శివాజీ అర్జున్ భార్యకు మాట ఇచ్చాను అందుకే అర్జున్ ను కెప్టెన్ గా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
కానీ అంతకు ముందు అమర్ శివాజీ దగ్గరికి వెళ్లి కెప్టెన్ గా అవ్వడానికి మద్దతు ఇవ్వాలని కోరగా ఓకే చెప్పాడు.. మాటిచ్చాను.. దాని కోసం చచ్చిపోతాను అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాడు. కానీ చివరికి అర్జున్ భార్యకు మాటిచ్చాను అంటూ మాట మార్చేశాడు.. దీంతో శివాజీ రెండు నాలుకలతో మాట మార్చేశాడు అని ఆడియెన్స్ మాట్లాడు కుంటున్నారు..
ఫినాలే ముందు ఇలా చేసి తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు అని చెప్పాలి.. మొత్తానికి బిగ్ బాస్ అయితే ఇచ్చిన సమయంలో కెప్టెన్ గా ఎవరో ఒకరిని ఫిక్స్ చేయలేదు అని ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ను రద్దు చేసాడు.. ఇలా చెప్పగానే చివరికి శివాజీ కూడా అమర్ కు సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది.. కానీ అప్పటికే బిగ్ బాస్ అమర్ ఫోటోను కాల్చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.