Russian President Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ప్రశంసలు అందుకున్న బైడెన్..
Russian President Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే బైడెన్ ను అధ్యక్షుడిగా చూసేందుకు ఇష్టపడతానని అన్నారు. ట్రంప్ కంటే బైడెన్ ‘ఎక్కువ అంచనా వేయగలడు’ అని ఆయన అన్నారు.
క్రెమ్లిన్ ఇచ్చిన వ్యాఖ్యల ప్రకారం పుతిన్ మాట్లాడుతూ.. బైడెన్ కు ఎక్కువ అనుభవం ఉంది. అతను ఎక్కువ దూరం ఆలోచించగలరు. ఓల్డ్ స్కూల్ పొలిటికల్ లీడర్ అని పుతిన్ అభివర్ణించారు. అమెరికా ప్రజల విశ్వాసం ఉన్న ఏ నాయకుడితోనైనా తాము కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు.
బైడెన్ పట్ల తన ప్రాధాన్యతను వ్యక్తం చేసినప్పటికీ, పుతిన్ వైట్ హౌజ్ ను విమర్శించారు, ‘ప్రస్తుత పరిపాలన హానికరమైన మరియు తప్పుడు విధానాన్ని అనుసరిస్తోందని నేను నమ్ముతున్నాను. ఇదే విషయాన్ని నేను అప్పుడు అధ్యక్షుడు బైడెన్ కు కూడా చెప్పాను’. అని చెప్పారు పుతిన్.
దక్షిణ కరోలినాలో జరిగిన ర్యాలీలో పుతిన్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘ఇప్పుడు అదొక కాంప్లిమెంట్.. అండ్ ఖచ్చితంగా, అతను అలా చెబుతాడు. అతను నన్ను ఇష్ట పడడని నాకు తెలుసు. ఉక్రెయిన్ సహా బైడెన్ కు కావాల్సినవన్నీ ఇవ్వబోతున్నారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ప్రముఖులైన వీరు ముగ్గురి వ్యాఖ్యలపై ప్రపంచం యావత్తు చర్చ మొదలైంది. పుతిన్ ఏంటి అమెరికా అధ్యక్షుడిని మెచ్చుకోవడం ఏంటని భిన్నమైన వాదనలు మొదలయ్యాయి. అమెరికా, రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుుంది. మరి ఇది ఇలా ఉంటే ఇంతలా బైడెన్ లో పుతిన్ కు నచ్చిన విషయం ఏంటని అనుకుంటున్నారు.