Nara Bhuvaneshwari : కుప్పం నుంచి  భరిలోకి దిగనున్న భువనేశ్వరి.. స్వయంగా వెల్లడించిన బాబు సతీమణి..!!

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పొత్తుల వేళ మరో కీలక పరిణామానికి తెర లేచింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాబుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను బరిలోకి దిగాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ జోరుగా కొనసాగుతోంది. కుప్పంలో రెండు కుటుంబాలను ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేశారు. స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మనసులో కోరిక ఉందని చెప్పుకచ్చారు.

35 సంవత్సరాలుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు ఈ సారి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించామని.. కుప్పం బరిలో తాను నిలబడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు. కుప్పం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు వరుసగా 7 సార్లు గెలుపొందారు. ఈ సారి అక్కడ ఆయనను ఓడించేందుకు వైసీపీ భారీగా కసరత్తు చేస్తోంది. కానీ, బాబు తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.

ప్రతీ 3 నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. కేడర్ తో మమేకం అవుతున్నారు. ఈ సారి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. భువనేశ్వరిని విజయవాడ పార్లమంట్ నుంచి పోటీ చేయించాలంటూ కొందరు నేతలు ఇప్పటికే బాబును కోరారు. కానీ, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇప్పటికే తెలుగుదేశం+జనసేన, బీజేపీ పొత్తు కారణంగా సీట్ల సర్దుబాట్ల వ్యవహారం సంక్లిష్టంగా మారింది. చంద్రబాబు, లోకేష్, భరత్, బాలయ్య పోటీలో ఉన్న సమయంలో మరొకరిని బరిలోకి దింపడంపై బాబు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పుడు కుప్పం బరిలో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలతో ఆలోచన మరిందా.. కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేయడం ఖాయమైందా..? అనే చర్చ మొదలైంది. ఏపీ పొలిటికల్ మ్యాప్ లో భువనేశ్వరి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

TAGS