Bhatty vikramarka:సీఎం పదవి ఇస్తే బాధ్యతగా స్వీకరిస్తా:భట్టి విక్రమార్క
Bhatty vikramarka:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. అంతా అనుకున్నట్టే మ్యాజిక్ ఫిగర్‌ని సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది. ప్రకటించిన ఫలితాలని, ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని తేలిపోయింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ సందర్భంగా మధిర నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ విజయంతో పాటు సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం పదివికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అర్హుడని సీనియర్ నేత వీ హనుమంతరావు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మల్లు బట్టి విక్రమార్క సీఎం రేసులో తానున్నానంటూ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెత్యేఆ మధిరలో విజయం సాధించిన అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ `తనకు సీఎం పదవి స్తే బాధ్యతగా స్వీకరిస్తానని ఆసక్తికరంగా స్పందించారు. రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజల తెలంగాణ పాలన వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామన్నారు. అన్ని నియోజక వర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన తరువాత ఎమ్మెల్యేల మంతా ఒక్క చోటికి చేరతాం. వారు సీఎల్పీ లీడర్‌గా కొనసాగమంటే కొనసాగుతా`అన్నారు.