Bhashyam Praveen : ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీబిజీ అయిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు ప్రచారంలో గ్రామగ్రామాన జన నీరాజనం పలుకుతున్నారు. ప్రవీణ్ గెలుపు నల్లేరుపై నడకే కావడంతో వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరుతున్నారు. బుధవారం అచ్చంపేటలోని పేరంటాళమ్మ ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి భాష్యం ప్రవీణ్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ.. ఎల్లవేళలా అండగా ఉంటానని, ఆశీర్వదించాలని కోరారు. ఒక్క అవకాశం అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ తన చేతకాని పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తికి మరో అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ప్రజలను కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. టీడీపీలో చేరిన వారంతా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
జోరుగా చేరికలు..
భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా నియోజకవర్గ వ్యాప్తంగా చేరికలు కొనసాగుతున్నాయి. పడమటి బజారుకు చెందిన 40 కుటుంబాల వారు సుమారు 200 మంది టీడీపీ కండువాలు కప్పుకున్నారు. అలాగే కొండూరు గ్రామ పంచాయతీలోని నిండుజర్ల గ్రామానికి చెందిన పది మంది టీడీపీలో చేరారు. అచ్చంపేటలోని 52వ బూత్ కు చెందిన 23 కుటుంబాలు, అచ్చంపేటకు చెందిన పలువురు పసుపు కండువాకు కప్పుకున్నారు.
క్రోసూరు మండలంలోని విప్పర్ల భాష్యం ప్రవీణ్ సమక్షంలో తొమ్మిది కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వ ఎంతో అవసరమని ప్రజలు భావిస్తున్నారన్నారు. అలాగే క్రోసూరు మండలంలోని బాలెమర్రుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.
భర్తకు తోడుగా సతీమణి..
భాష్యం ప్రవీణ్ ను గెలిపించాలని ఆయన సతీమణి లావణ్య పెదకూరపాడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
100 ముస్లిం కుటుంబాలకు బియ్యం పంపిణీ..
భాష్యం ప్రవీణ్ సేవాగుణం అందరికీ తెలిసిందే. గతం నుంచే ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతి-విజయవాడ రోడ్డులోని సుభానీ కాలనీలో 100 ముస్లిం కుటుంబాలకు భాష్యం ప్రవీణ్ 25 కేజీల బియ్యం టిక్కీలను పంపిణీ చేశారు.