Bhashyam Praveen : టీడీపీలోకి వరుసగా ప్రజలు చేరుతుండడంతో వైసీపీకి వణుకు పుడుతోంది. తాజాగా ఈరోజు బెల్లంకొండ మండలం వన్నాయపాలెం గ్రామంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆ గ్రామ సీనియర్ నాయకులు & జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబరు మేకల సోమయ్య, ఆయన కుమారుడు, సర్పంచ్ మేకల వెంకటస్వామి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో సూపర్-6 పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భాష్యం ప్రవీణ్ సూచించారు.