Bhasyam Praveen : చంద్రబాబు చేతుల మీదుగా బీఫాం అందుకున్న భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen who received the Beform from the hands of Chandrababu
Bhasyam Praveen : టీడీపీ బీఫారాల పంపిణీ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా అభ్యర్థులకు బీఫారాలు అందజేసి వారికి దిశానిర్ధేశం చేశారు.
ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బీఫారం అందజేశారు.
చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫారం అందుకున్న అనంతరం మీడియాతో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం – జనసేన – బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడారు. అధినేత నమ్మకాన్ని నిలబెడుతానని.. విజయంతో తిరిగి వస్తానని ప్రకటించారు.
బీఫారం అందుకున్న అనంతరం తన స్వగ్రామం పెదపరిమి గ్రామానికి వెళ్లి తన తండ్రి భాష్యం వెంకట్రావు గారి ఆశీస్సులు పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తీసుకున్నారు.