Bhashyam Praveen : పెదకూరపాడులో నామినేషన్ వేసిన టిడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గ టిడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అమరావతి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. పెదకూరపాడు ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించిన అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ తన నామినేషన్ కార్య్రక్రమానికి టిడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆప్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శాయశక్తులా తన విజయం కోసం కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం అందరూ పాటుపడాలని అన్నారు. సూపర్-6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్గృతంగా ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.