
Bhashyam Praveen
Bhashyam Praveen : అమరావతి మండలం, ఉంగుటూరు, దిడుగు, వైకుంఠపురం గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నఈ సైకో పాలనను వెళ్ళగొట్టాలంటే ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటును ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు మరియు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా ఉండి కృషి చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన నాయకులను, కార్యకర్తలను కోరారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చూసి, అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవలసిన అవసరముందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.