
Bhashyam Praveen Son Lokesh Babu
Bhashyam Praveen Son : తండ్రికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాష్యం లోకేష్ బాబు పాల్గొన్నారు. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయన ముద్దుల తనయుడు భాష్యం లోకేష్ బాబు నేను సైతం అంటూ పాల్గొన్నారు.
తండ్రికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నభాష్యం లోకేష్ బాబు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన ముద్దులొలికే మాటలతో, హావభావాలతో తన తండ్రిని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాడు. ఈ సందర్భంగా లోకేష్ బాబును గ్రామస్థులు ఆశీర్వదించి భాష్యం ప్రవీణ్ కు ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెబుతున్నారు.