Bhashyam Praveen : గెలుపు ఖాయమైపోయింది..ఇదంతా భారీ మెజార్టీ కోసమేనంటున్న భాష్యం ప్రవీణ్.. నేడు క్రోసూర్ లో ప్రజాగళం
Bhashyam Praveen : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ,జనసేన, బీజేపీ జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి దాదాపు ఖరారైనట్టే అని జనాల నాడిని బట్టి తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అందరి కళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడుపై పడింది. పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని తెలిసిందే.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులో పర్యటించనున్నారు. ఈసందర్భంగా పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. అనంతరం క్రోసూరు, సత్తెనపల్లి ప్రాంతాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరుకు చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహ కూడలి బహిరంగ సభలో పాల్గొంటారు.
పల్నాడు జిల్లాలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసి అందరూ క్రియాశీలకంగా పనిచేసేలా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలో వైసీపీ నేతల దోపిడీ పర్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేతలకు ఆయన సూచించనున్నారు. ఒక చేత్తో రూ.10 ఇచ్చి ప్రభుత్వం మరో పక్క రూ.100 దోచుకుంటున్న వైనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. అలాగే పల్నాడు టీడీపీ అభ్యర్థులు ఇప్పటివరకు చేస్తున్న ప్రచారతీరు, అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజలకు మరింత చేరువకావడానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి వివరించనున్నారు.
ఈ సందర్భంగా పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చంద్రబాబు పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రోసూర్ పట్టణంలో ప్రజాగళం బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు రాబోతున్నారని, అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సభకు ఐదు మండలాల నుంచి దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు వచ్చి విజయవంతం చేయబోతున్నారన్నారు. ప్రజాగళం సభ కోసం టీడీపీ శ్రేణులు గత మూడు రోజులుగా అహర్నిషలు కృషి చేశారన్నారు.
అధినేత సభ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీటింగ్ సక్సెస్ తోనే తాను ఘన విజయం సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తన గెలుపు ఖాయమైందని, మరింత మెజార్టీ సాధించేందుకే తాము కష్టపడుతున్నామన్నారు. ఉమ్మడి గుంటూరులోనే పెదకూరపాడులో భారీ మెజార్టీ సాధించబోతున్నామన్నారు. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి ఏర్పాటుతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, తమ ప్రభుత్వం అత్యధిక స్థానాలు సాధించి చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి ఖాయమైందన్నారు. తమ మ్యానిఫెస్టోలోని అంశాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు.
ఇదిలా ఉండగా..గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రత్యర్థులుగా పోటీ చేయడం.. ఓట్ల చీలిక కలిసొచ్చి.. పెదకూరపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరు శంకరరావు గెలిచారు. అయితే ఈసారి భాష్యం ప్రవీణ్ ను పోటీలోకి దించడంతో నియోజకవర్గ రాజకీయం మరింత రంజుగా సాగుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరుకు వ్యతిరేకంగా, నియోజకవర్గ సమస్యలపై ఆందోళనలు నిర్వహించి టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించారు భాష్యం ప్రవీణ్.
సెగ్మెంట్ లో తన ట్రస్ట్ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ట్రై సైకిళ్లు, తోపుడు బళ్ల పంపిణీ వంటివి చేసి జనాల ఆదరణ చూరగొన్నారు. భాష్యం ప్రవీణ్ కు టికెట్ రావడంతో నంబూరు ఓటమి ఎప్పుడో ఖాయమై పోయిందని స్థానికులు చెబుతున్నారు. టీడీపీ నుంచి ప్రవీణ్ పోటీలోకి దిగడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వారి బంధుగణం, కుల సమీకరణలు ఆయనకు కలిసిరానున్నాయి.