– వేలాదిగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భీజేపీ నాయకులు కార్యకర్తలు
– సమన్వయంతో నామినేషన్ సక్సెస్
Bhashyam Praveen : కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్ ఊహించని విధంగా సూపర్ సక్సెస్ కావటంతో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా యువత, వృద్ధులు, మహిళలు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వారు నామినేషన్ కు వేలాదిగా తరలిరావటంతో పెదకూరపాడులో పూర్వవైభవం తథ్యం అని, కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గెలుపు నల్లేరుపై నడకేనంటూ పలువర్గాలు రచ్చబండపై చర్చించుకుంటున్నారు.
జనసేన, భాజపా, తెదేపా సమన్వయంతో గతంలో ఫ్యాక్షన్ గ్రామాల నుండి సైతం సోదరభావంతో కలసివచ్చి వైకాపా ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రజా బలంతో చాటారు. పెదకూరపాడు నామినేషన్ పర్వంలో ప్రజానీకంతో రహదారులు కిక్కిరిసాయి. తెలుగుదేశానికి పట్టున్న పెదకూరపాడు నియోజకవర్గంలో పునర్వైభవం తథ్య అన్న విధంగా నామినేషన్ ర్యాలీ సాగింది.
శ్రీధరన్న వెంటరాగా.. రాధన్నా కదలిరాగా..
పార్టీ నేత వంగవీటి రాధా ను చూసి జనసేన నేతలు, కార్యకర్తలు అభిమానులు కేరింతలు కొట్టారు. నియోజకవర్గంలో మైనారిటలు అధిక శాతం ఉండటంతో మండలి మాజీ చైర్మన్ షరీఫ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జనసేన సమన్వయంతో నామినేషన్ పర్వం విజయవంతం కావటం క్షేత్రస్థాయిలో ఈ సమన్వయం స్పష్టంగా కనిపించటంతో తెదేపా నేతలు ప్రవీణ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైకాపాకు బలం ఉన్న గ్రామాల్లో సైతం యువత, మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి జనసేన, తెదేపా జెండాలు పట్టుకుని భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా నిలవటంతో ఆయా గ్రామాల్లో వైకాపా నేతలు చర్చించు కుంటున్నారు.