Bhashyam Praveen : ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడ్ మార్నింగ్ బెల్లంకొండ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ పట్టణంలో పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నాయకులు కలిసి విడుదల చేసన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని టీడీపీ, జనసేన నాయకులకు సూచించారు. ప్రజలందరూ మే 13న తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని, టీడీపీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు బెల్లంకొండ పట్టణానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.