Pedakurapadu : భాష్యం ప్రవీణ్ గెలుపు కోసం ఏకమైన పెదకూరపాడు ప్రజలు

Pedakurapadu, Bhashyam Praveen
Pedakurapadu News : పల్నాడు జిల్లాకు చెందిన నియోజకవర్గం ‘పెదకూరపాడు’. ఈ నియోజకవర్గం నుంచి మహాకూటమి (టీడీపీ) అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ను ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భష్యం ప్రవీణ్ గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పల్నాడుకు సుపరిచితుడు.
అట్టడుగు నుంచి వచ్చిన భాష్యంకు పేదల కష్టాల గురించి బాగా తెలుసు. గొప్ప నాయకుడిగి పల్నాడులో గుర్తింపు సంపాదించుకున్నారు. నారా లోకేశ్ కు చాలా దగ్గరి వ్యక్తి కావడంతో ‘యువగళం’ పాదయత్ర సమయంలో జిల్లాలో భారీగా కార్యక్రమాలు నిర్వహించారు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు భాష్యం. నియోజకర్గాల్లోని అన్ని వయస్సుల ప్రజలతో ఆయన అనుబంధం ఉంది. ముఖ్యంగా యూత్ లో ఆయనకు భారీగా క్రేజ్ ఉంది. ఐదేండ్ల నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు భాష్యం. రెండేళ్ల క్రితం టికెట్ పై చంద్రబాబు హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నాడు.
పెదకూరపాడులో ఆయన గెలుపు దాదాపు కన్ఫమ్ అని పల్లెల నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ సీటును తన ఖాతాలో వేసుకోవాలని ప్రవీణ్ రెండేళ్ల నుంచి పనులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వెళ్తున్నారు.
పెదకూరపాడుకు చెందిన టీడీపీ, జనసే, బీజేపీ నాయకులు సోమవారం (ఏప్రిల్ 1) రోజున ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేందుకు తామంతా కిలిసి పని చేస్తామని చెప్పారు. ఈ సారి భాష్యం నయకత్వంతో నియోజకవర్గం మరింత డెవలప్ కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.