Bhashyam Praveen : 75 తాళ్లూరులో భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం

Bhashyam Praveen
Bhashyam Praveen : పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను గ్రామస్థులు సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బిజెపి ముఖ్య నేతలతో విడుదల చేసిన మేనిఫెస్టో గురించి వివరించారు. ప్రజలకు మేనిఫెస్టో గురించి మహిళలకు, యువతకు వివరించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు సూచించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.