Bhashyam Praveen : అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే..త్రాగు, సాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తా..
Bhashyam Praveen : కృష్ణానది చెంతనే ఉన్న పెదకూరపాడు నియోజ కవర్గంలో అన్ని గ్రామాల ప్రజలు త్రాగు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని పెదకూరపాడు టిడిపి కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సమస్య పరిష్కరిస్తానని భాష్యం ప్రవీణ్ తెలిపారు.
క్రోసూరు లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని శనివారం అయినా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లా డుతూ నియోజకవర్గంలో ఐదేళ్ల లో ప్రకృతి సంపదలను నంబూరు శంకర్రావు దోచుకున్నారని భాష్యం ప్రవీణ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో శంకర్రావుకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారిన వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారులు, మురుగు కాలువలు అద్వానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కొందరు అధికార పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు వాయిస్ మెసే జ్ లు పంపుతూ తెలుగుదేశం కూటమి నుంచి మైనార్టీలను దూరం చేసే కుట్రలు చేస్తున్నారని ఎవరు వాటిని నమ్మొద్దని భాష్యం ప్రవీణ్ తెలిపా రు. సంగం డైరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్ బాబు, జనసేన పార్టీ సమన్వయకర్త ఎర్రి శెట్టి రామకృష్ణ, తెలుగుదేశం నాయకురాలు పటాన్ నూర్జహాన్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
కూటమి పాలనతోనే సంక్షేమం..
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణం మెరుగు తెలుగుదేశం కూటమితోనే సాధ్యమని భాష్యం ప్రవీణ్ అన్నారు. దొడ్లేరు, ఉయ్యందన, గరిక పాడు గ్రామాల్లో భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.