Bhashyam Praveen Campaign : పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి నిర్విరామంగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. నియోజకవ ర్గంలో ఉన్న ప్రతి మండలానికి వెళ్లి ప్రజలు పడు తున్న కష్టాలని తెలుసుకొని వారికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈరోజు ఎండ్రాయి, నరుకుళ్ళపాడు గ్రామాల్లో పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రచారం ప్రచారం నిర్వహించి నాయకులతో సమావేశమయ్యారు. గ్రామం లో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని తనను ఆశీర్వదించాలని భాష్యం ప్రవీణ్ ప్రజలను కోరారు.
ఎండ్రాయి, నరుకుళ్ళపాడు గ్రామాలకు వచ్చిన భాష్యం ప్రవీణ్ కు జనసేన, బిజెపి, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
నాయకులతో పాటుగా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా భాష్యం ప్రవీణ్ కు స్వాగతం తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఉమ్మడి అభ్యర్థికి వారు స్వాగతం పలకడంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ముఖ్యంగా పెద్దకూరపాడు నియోజక వర్గంలోని గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని భాష్యం ప్రవీణ్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో నెలకొన్న టువంటి సమస్యలను పరిష్కరిస్తారని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.