- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన భాష్యం ప్రవీణ్
Bhashyam Praveen Campaign : క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు, అనంతవరం గ్రామానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరాయి.
ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ క్రోసూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచేటి సాయిబాబు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో హసనాబాద్ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు, అనంతవరం గ్రామానికి చెందిన 35 కుటుంబాలు భాష్యం ప్రవీణ్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
టీడీపీలో చేరిన వారందరికి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం టీడీపీలో చేరిన వారు భాష్యం ప్రవీణ్ ను సత్కరించారు.
ఈ సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు.
నాయకలు, కార్యకర్తలు కృషి చేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు. ఈరోజు క్రోసూరు మండల కేంద్రానికి చెందిన 5 కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీని వీడి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచేటి సాయిబాబు , గ్రామ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో భాష్యం ప్రవీణ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.